Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలం ప్రభుత్వ టీచర్ మృతి

Follow Udayam on Google
Naresh Aug 22, 2026 7:45 PM నిర్మల్General
కుబీర్ మండలం ప్రభుత్వ టీచర్ మృతి - Udayam
భైంసా సమీపంలోని మాటేగావ్ నీటికుంటలో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహేష్ (36) మృతి చెందాడు. మృతుడు కుబీర్ మండలం బెల్గాం పాఠశాలలో పనిచేస్తూ, భైంసాలో నివసిస్తున్నాడు. శుక్రవారం ఆప్షనల్ హాలిడే కావడంతో బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మొబైల్ లొకేషన్ ఆధారంగా వెతకగా, కుంటలో శవమై కనిపించాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...