Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్న వేధింపుల ఆరోపణలతో వివాహిత బలవన్మరణం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 10, 2026 11:30 AM జనగామ General
కట్న వేధింపుల ఆరోపణలతో వివాహిత బలవన్మరణం - Udayam
జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం సముద్రాలలో వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. సీఐ వేణు వివరాల ప్రకారం.. జఫర్‌గడ్‌కు చెందిన 28 ఏళ్ల మహిళకు సముద్రాలకు చెందిన అనిల్‌తో వివాహమైంది. పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారాన్ని భర్త ఖర్చుల కోసం విక్రయించాడని తెలిపారు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతో ఆమె పురుగు మందు తాగి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...