వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ములాఖత్‌లో కలిశారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా సుమన్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు.
సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలంటూ తెలంగాణ భవన్‌లో వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సింగరేణి సంస్థ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో సుమన్‌పై కేసు నమోదైంది. నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పిఎస్‌కు బదిలీ చేశారు.
Comments
Loading comments...

