వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమరి గ్రామంలో కృష్ణుని ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. స్వయంగా పల్లకి మోసి కృష్ణుని ఊరేగింపును ప్రారంభించిన ఎమ్మెల్యే, అనంతరం భక్తులతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమంలోనూ పాల్గొనడంతో గ్రామంలో భక్తుల సందడి నెలకొంది.
Comments
Loading comments...

