వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే రెండు రోజులుగా తుఫాన్ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మళ్లీ వర్షం సమస్యగా మారింది.
పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రహదారులపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

