Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: కమాండెంట్ హనుమంతు

Follow Udayam on Google
Super Admin Jul 25, 2026 10:21 PM చిత్తూరుక్రైమ్
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: కమాండెంట్ హనుమంతు - Udayam
చిత్తూరు హోంగార్డులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని రాయలసీమ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎ. హనుమంతు సూచించారు. శనివారం చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోంగార్డ్స్ దర్బార్‌లో ఆయన మాట్లాడుతూ, హోంగార్డుల సేవలు పోలీస్ వ్యవస్థలో కీలకమని అన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధతో పాటు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా, వ్యక్తిగత బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...