Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం రెడ్‌క్రాస్ కమిటీ ఏర్పాటు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 4:15 PM బాపట్లGeneral
కర్లపాలెం రెడ్‌క్రాస్ కమిటీ ఏర్పాటు - Udayam
కర్లపాలెం మండల నూతన రెడ్‌క్రాస్ కమిటీని నియమించినట్లు తహసీల్దార్ రవీంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం బాపట్ల జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ నారాయణ బట్టు సమక్షంలో సభ్యులను ఎంపిక చేశారు. కమిటీ చైర్మన్‌గా ఇనకొల్లు పోలీసు రావు, వైస్ చైర్మన్‌గా లలిత బాబు, కోశాధికారిగా పరమానంద కుమార్ నియమితులయ్యారు. నూతన సభ్యులను తహసీల్దార్ అభినందించి, రెడ్‌క్రాస్ సేవలను విస్తరించాలని సూచించారు.

Comments

G
Loading comments...