వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా కౌతాళం మండలం సులికేరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షాహీన్ (38), ఆమె కుమార్తె యాస్మిన్ (13) కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి కర్ణాటకలోని హంపి శ్రీ విరూపాక్ష స్వామి దర్శనానికి వెళ్లారు.
ఈ క్రమంలో తుంగభద్ర నదిలో నలుగురు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోయారు. ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా షాహీన్, యాస్మిన్ గల్లంతయ్యారు.
Comments
Loading comments...

