వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిధాన్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మమతా బెనర్జీ సన్నిహితురాలు కృష్ణా చక్రవర్తి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందించిన ఆమె, కేవలం కౌన్సిలర్‌గా మాత్రమే కొనసాగుతానని ప్రకటించారు. ఇటీవల బెంగాల్ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో, ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అధికార టీఎంసీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

