Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్‌, హాకీలో భారత్‌ విజయాలు గర్వకారణం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:37 AM జాతీయంక్రీడలు
క్రికెట్‌, హాకీలో భారత్‌ విజయాలు గర్వకారణం  - Udayam
ఆసియా కప్‌లో మహిళల క్రికెట్‌ జట్టు విజయం, జూనియర్‌ ఆసియా కప్‌లో పురుషుల, మహిళల హాకీ జట్ల విజయాలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ విజయాలు భారత క్రీడారంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. మహిళల క్రికెట్‌ జట్టు ఆత్మవిశ్వాసం, నిలకడతో ఆడి ఆసియా కప్‌ను గెలుచుకుందని మోదీ అన్నారు. జూనియర్‌ ఆసియా కప్‌లో దక్షిణ కొరియా, చైనాను ఓడించి పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలవడాన్ని అభినందించారు.

Comments

G
Loading comments...