వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో బీజేపీ గెలిచాక దాడుల సంస్కృతి పెరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. తమ కార్యకర్తలు శ్రీకాంత్, రాజశేఖర్‌లపై బీజేపీ మూకలు హత్యాయత్నం చేశాయన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రోత్సాహంతోనే ఈ అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు. నిందితులను వెంటనే రిమాండ్ చేసిన పోలీసులకు అభినందనలు తెలిపిన ఆయన, ప్రశాంతతకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Comments
Loading comments...

