వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మర్రివానీపల్లి గ్రామ శివారులో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీలు చేపట్టిన పోలీసులు, ఎలాంటి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ఈ వాహనాలను పట్టుకున్నారు. ఇవి వావిలాల గ్రామానికి చెందిన ట్రాక్టర్లుగా గుర్తించి, యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు.
Comments
Loading comments...

