వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నుంచి హనుమకొండకు కేశవపట్నం, కొత్తగట్టు, సైదాపూర్, రాయికల్, ముల్కనూర్, ఎల్కతుర్తి మీదుగా నూతన బస్సు బుధవారం ప్రారంభమైంది. వరంగల్ డిపో-1కు చెందిన బస్సు ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి వచ్చింది.
ప్రతిరోజు ఉదయం 7 గంటలకు కరీంనగర్ నుంచి బస్సు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

