Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌ బస్టాండ్‌లో నిబంధనలకు విరుద్ధంగా తినుబండారాల విక్రయం

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 8:51 AM కరీంనగర్General
కరీంనగర్‌ బస్టాండ్‌లో నిబంధనలకు విరుద్ధంగా తినుబండారాల విక్రయం - Udayam
కరీంనగర్ బస్టాండ్‌లోని దుకాణాల్లో వ్యాపారులు ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు తినుబండారాలు విక్రయిస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని శీతల పానీయాలు, వాటర్ బాటిళ్లపై అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బస్టాండ్‌లో నాసిరకం పదార్థాలు, లేబుల్స్ లేని తినుబండారాలు విక్రయిస్తున్నప్పటికీ అధికారులు తనిఖీలు చేయడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు.

Comments

G
Loading comments...