Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతుల బెడదతో స్థానికులకు ఇబ్బందులు

Follow Udayam on Google
Saychi kumar Aug 31, 2026 10:29 AM కామరెడ్డిGeneral
కోతుల బెడదతో స్థానికులకు ఇబ్బందులు - Udayam
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో కోతుల గుంపులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మండలంలోని నర్సింగ్రావుపల్లిలో ఇటీవల కొందరిని కోతులు కరిచినట్లు గ్రామస్థులు తెలిపారు. గుంపులుగా ఇళ్లలోకి చొరబడుతూ ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడంతో పాటు చిన్నారులు వృద్ధులను భయపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడదను అరికట్టేందుకు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...