వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గజపతినగరం కోర్టులో అంతర్జాతీయ సద్భావన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ మేరకు ఫస్ట్ క్లాస్ మేజిస్టేట్ విజయ్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ఐక్యత, సద్భావనతో సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

