వార్తలకు తిరిగి వెళ్లండి

కెరమెరి మండల కోలాం సంఘం అధ్యక్షుడిగా సిడాం భీంరావు ఎంపికయ్యారు. కోలాం ప్రజల అభివృద్ధి, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడటంతోపాటు, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. కోలాం సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు, యువతకు విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

