Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి: ఏఐటీయూసీ

Follow Udayam on Google
pruthviraj Jul 31, 2026 5:25 PM జగిత్యాలGeneral
కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి: ఏఐటీయూసీ - Udayam
ప్రభుత్వం ఒక్కో కోడిగుడ్డుకు రూ.6చెల్లిస్తుండగా, మార్కెట్‌లో ధర రూ.8 నుంచి రూ.9వరకు ఉండటంతో మధ్యాహ్న భోజనకార్మికులు నష్టపోతున్నారని ఏఐటీయూసీ జిల్లా మధ్యాహ్న భోజనకార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి వెన్న మహేష్ తెలిపారు. కోడిగుడ్లు,నిత్యావసరాలను ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డి.పద్మ,ఎం.జయశ్రీ,ఎండీ.షంషేర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...