వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మండలం కోడిగినహళ్లి పంచాయతీలో రూ.10 లక్షలతో ధోబీ ఘాట్ నిర్మాణానికి మంగళవారం భూమిపూజ నిర్వహించారు. శ్రీరంగరాజుపల్లి, చిన్నపల్లి, ఎస్.బీరేపల్లిలో సీసీ రోడ్ల పనులను కూడా ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప తెలిపారు.
Comments
Loading comments...

