వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడ పట్టణంలోని 12వ వార్డులో డీసీఎం కార్యాలయం నుంచి సింగారం వెళ్లే రహదారి ఇరువైపులా చెత్త పేరుకుపోయింది. రాత్రివేళ కోడి వ్యర్థాలు, కొబ్బరి బోండాలు, ఇతర చెత్తను రోడ్డుపక్కన పడేస్తుండటంతో దుర్వాసన, అపరిశుభ్రత నెలకొంది.
సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. చెత్త వేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

