Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 07, 2026 9:02 PM జగిత్యాలGeneral
కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలి - Udayam
గ్రామ పంచాయతీ పాలకవర్గాల్లో కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లతకు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ సమావేశాలు, గ్రామ సభలకు విలేకరులను అనుమతించాలని, సమావేశ మందిరాలు, గ్రామ సభల ప్రదేశాల్లో వాయిస్ రికార్డింగ్‌తో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...