Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపాలెంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎంపీడీవో

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 12:12 PM అనకాపల్లి General
కొండపాలెంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎంపీడీవో - Udayam
రోలుగుంట మండలం కొండపాలెం పంచాయతీలో చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఎంపీడీవో నాగేశ్వరరావు బుధవారం పరిశీలించారు. వీధుల్లోని చెత్త, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్య లోపాలు లేకుండా చూసి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...