Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనుమరుగవుతున్న మంచినీటి చెరువులు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 09, 2026 8:45 PM శ్రీకాకుళంGeneral
కనుమరుగవుతున్న మంచినీటి చెరువులు - Udayam
సంతబొమ్మాళి మండలంలో కొన్ని మంచినీటి చెరువులు ఆక్రమణలతో కనుమరుగవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నౌపడ గ్రామంలోని సర్వే నం. 418లో ఉన్న గుండమ్మ చెరువు ఆక్రమణదారుల చెరలో చిక్కుకుని క్రమంగా తన రూపురేఖలను కోల్పోయిందని ఆరోపిస్తున్నారు. జల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు, నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో అవి అమలుకు నోచుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

Comments

G
Loading comments...