వార్తలకు తిరిగి వెళ్లండి

కంటోన్మెంట్‌లో పేదల ఇళ్ల కూల్చివేతలు, నోటీసులపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 90–100 ఏళ్లుగా చిన్న స్థలాల్లో నివసిస్తున్న పేదలనే అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.
99 ఏళ్ల లీజులతో ఉన్న బడాబాబుల బంగ్లాలకు నోటీసులు ఇవ్వడం లేదని విమర్శించారు. సర్వే నంబర్ 157/1లోని భూములపై ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

