వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలం దొండ్లపల్లి–కుతినేపల్లి గ్రామాల మధ్య నవాబుపేటకు వెళ్లే రహదారిపై 100 మీటర్ల మేర కంకర పరిచి బీటీ వేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాజాపూర్ నుంచి నవాబుపేటకు వెళ్లేందుకు ఈ రహదారినే ఎక్కువగా వినియోగిస్తారు.
అసంపూర్తి పనులతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు, గుత్తేదారు స్పందించి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

