వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం ఆర్టీసీ ఇన్‌గేట్ వద్ద శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శుక్రవారం భక్తులు సమర్పించిన చీరల బహిరంగ వేలంపాట నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సమక్షంలో జరిగిన వేలాన్ని ఆలయ చైర్మన్ మాగపు రాజు పర్యవేక్షించారు.
అమ్మవారి వస్త్రాలను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. వేలం ద్వారా ఆలయానికి మంచి ఆదాయం సమకూరిందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

