Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనీస వేతనాలను అమలు చేయాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 10, 2026 1:25 PM మంచిర్యాలGeneral
కనీస వేతనాలను అమలు చేయాలి - Udayam
అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయాలని ఐద్వా మహిళా సంఘం జన్నారం మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్, సిపిఎం జన్నారం మండల కార్యదర్శి మురిమడుగు లింగన్న డిమాండ్ చేశారు. జైల్ భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వారు ధర్నా రాస్తారోకో చేశారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యతని గుర్తు చేశారు.

Comments

G
Loading comments...