Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ఏబీవీపీ నాయకుల అరెస్టు

Follow Udayam on Google
sudheer Aug 18, 2026 1:44 PM కరీంనగర్General
కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ఏబీవీపీ నాయకుల అరెస్టు - Udayam
ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. వర్కింగ్ కమిటీ మెంబర్ రాకేష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరగగా.. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పిటిసికి తరలించారు.

Comments

G
Loading comments...