వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు తీర్చాలని, శక్తి స్కీమ్, జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు.
తెలంగాణ చౌరస్తా నుంచి ర్యాలీగా వచ్చి కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని, అరెస్టు చేసి పీటీసీకి తరలించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

