Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ కార్యాలయం ముందు దళిత హక్కుల పోరాట సమితి ధర్నా

Follow Udayam on Google
H M G H Q Aug 24, 2026 5:02 PM కర్నూలుGeneral
కలెక్టర్ కార్యాలయం ముందు దళిత హక్కుల పోరాట సమితి ధర్నా - Udayam
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దళితులపై వివక్ష, దాడులను అరికట్టాలని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దళితుల అభివృద్ధికే వినియోగించాలని, దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించాలని నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...