Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కివీస్‌తో టెస్టులకు ముందు జైస్వాల్‌ జోరు

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 2:58 PM జాతీయంక్రీడలు
 కివీస్‌తో టెస్టులకు ముందు జైస్వాల్‌ జోరు - Udayam
కొంతకాలంగా ఫామ్‌ లేమితో ఇబ్బందిపడుతున్న భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌-ఎతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 162 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లతో 155 పరుగులు సాధించాడు. భారత్‌-ఎ 36/2తో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన యశస్వి.. యశ్‌ రాథోడ్‌ (100\*)తో కలిసి 247 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

Comments

G
Loading comments...