Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేతన్‌ అగర్వాల్‌ ఇంట్లో మరో విషాదం

Follow Udayam on Google
సాయి తేజ Jul 05, 2026 8:47 PM జాతీయంక్రైమ్
కేతన్‌ అగర్వాల్‌ ఇంట్లో మరో విషాదం - Udayam
పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో విషాదం చోటుచేసుకుంది. మనవడి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన తాత దేవీచంద్‌ అగర్వాల్ గుండెపోటుతో మృతి చెందారు. మరోవైపు ఈ హత్య కేసు దర్యాప్తులో నిందితురాలు సియా గోయల్‌కు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే ఇష్టం లేని పెళ్లికి అంగీకరించిన సియా, నిశ్చితార్థం నుంచే కేతన్‌ను హతమార్చేందుకు పథకం రచించినట్లు స్నాప్‌చాట్‌ చాట్ల ద్వారా వెల్లడైంది. జరగని పెళ్లికి టికెట్లు బుక్ చేస్తున్నానంటూ ఆమె స్నేహితురాలికి పంపిన సందేశం దర్యాప్తులో కీలకంగా మారింది. ప్రస్తుతం పోలీసులు డిజిటల్ డేటాను పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...