Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలో భారత యువతి హత్య.. ఏడు నెలల తర్వాత నిందితుడి అరెస్టు

Follow Udayam on Google
కెనడాలో భారత యువతి హత్య.. ఏడు నెలల తర్వాత నిందితుడి అరెస్టు - Udayam
కెనడాలో భారత యువతి హిమాన్షీ ఖురానా (30) హత్య కేసులో నిందితుడు అబ్దుల్ గఫూరీ (32)ను పోలీసులు ఏడు నెలల తర్వాత అరెస్టు చేశారు. గత డిసెంబరులో టొరంటోలోని నివాసంలో హిమాన్షీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. హత్య అనంతరం దేశం విడిచి పారిపోయిన గఫూరీపై కెనడా వ్యాప్తంగా అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. తాజాగా టొరంటో విమానాశ్రయంలో అరెస్టు చేసి ఫస్ట్‌ డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...