వార్తలకు తిరిగి వెళ్లండి

గార KGBV ప్రిన్సిపాల్ రజని, అకౌంటెంట్ అమరావతీలను విధులనుంచి తొలగిస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
40 రోజుల కిందట కేజీబీవీలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదులపై అధికారులు విచారణ చేపట్టారు. డైట్ ప్రిన్సిపాల్ గౌరీ శంకర్ ఆధ్వర్యంలో కమిటీనివేదిక ఆధారంగా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

