Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేఎంసీ కమిషనర్ తో సుడా ఛైర్మన్ భేటీ

Follow Udayam on Google
K.Venkatesh Aug 25, 2026 1:53 PM ఖమ్మంGeneral
కేఎంసీ కమిషనర్ తో సుడా ఛైర్మన్ భేటీ - Udayam
ఖమ్మం నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మరింత సమన్వయంతో ముందుకు సాగుదామని సుడా ఛైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. KMCలో కమిషనర్ అభిషేక్ అగస్త్యతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతం, ప్రజలకు మరింత మెరుగైన సేవల అందజేయడంపై పలు అంశాలను చర్చించారు. అన్ని విభాగాల సమన్వయంతో ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...