వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన వరదతో నిండుకుండగా మారిన కడెం ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు సందర్శించారు. శనివారం సాయంత్రం కడెం ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామిలతోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సందర్శించి ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎగువ నుండి భారీ వరద వస్తున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులను వారు ఆదేశించారు.
Comments
Loading comments...

