వార్తలకు తిరిగి వెళ్లండి

కడప-చెన్నై హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మాడా బాలాజీరావు (45) మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం ఉదయం సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధిలోని బంగారుపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది.
వెంకటేశ్వరపురానికి చెందిన బాలాజీరావు హైవే దాటుతుండగా వాహనం ఢీకొట్టినట్లు సమాచారం అందింది. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

