వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా అట్లూరు మండలం ఎస్. వెంకటాపురంలో నీటి తొట్టిలో పడి రెండేళ్ల చిన్నారి వేదశ్రీ మృతి చెందింది. తూడారు కాలనీకి చెందిన హరిబాబు, సౌజన్య దంపతుల కుమార్తె వేదశ్రీ మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు ఇంటి దగ్గర ఉన్న నీటి తొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెద్దలు జాగ్రత్తగా ఉండాలని పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...

