Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల బీమా గడువు పొడిగింపు

Follow Udayam on Google
పంటల బీమా గడువు పొడిగింపు - Udayam
ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (PMFBY) కింద ఖరీఫ్‌-2026 పంటల ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ గడువు బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది. నాన్‌-లోనీ రైతులకు గడువు ముగిసిందని అధికారులు స్పష్టం చేశారు. పంట రుణాలు పొందిన రైతులు గడువులోగా ప్రీమియం చెల్లించి బీమా ప్రయోజనం పొందాలని సూచించారు.

Comments

G
Loading comments...