వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లా వీరఘట్టం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసిన పి.రవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఎస్బీఐ పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద మంజూరైన రూ. కోటి చెక్కును ఆయన భార్య లలితకు జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి అందజేశారు.
ఈ మేరకు మంగళవారం పార్వతీపురం పోలీస్ కార్యాలయంలో బ్యాంకు అధికారుల సమక్షంలో చెక్కును అందించారు. బాధిత కుటుంబానికి పోలీసుశాఖ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

