వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 2న బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టనున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
కన్నాయిగూడెం మండల బీఆర్‌ఎస్ శ్రేణులు ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మాజీ మండల అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య కోరారు.
Comments
Loading comments...

