Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవీ?: నిలదీసిన బీఆర్ఎస్

Follow Udayam on Google
S kumar Sep 08, 2026 4:19 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. పార్టీ కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. వృద్ధులు, విద్యార్థులు, యువతను ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. హామీలను నెరవేర్చకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...