వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజీ సమీపంలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మూడో రోజు మంగళవారం జ్ఞానాంబికాదేవి గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
అర్చకులు వేదమంత్రాలతో అభిషేకం నిర్వహించి, పూలమాలలతో అమ్మవారిని అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...

