వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల్ పట్టణంలోని హనుమాన్ కాలనీ (పిల్లిగుండ్ల)లో శ్రీ ముడుపుల ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఐదో రోజు గురువారం శ్రీ శివ కామేశ్వరి దేవి కామాక్షి మాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష హారతులు నిర్వహించారు. కాలనీవాసులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

