Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాల్వకు అడ్డంగా నిర్మాణాలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 21, 2026 7:57 PM నాగర్ కర్నూల్General
కాల్వకు అడ్డంగా నిర్మాణాలు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని పలు గ్రామాలకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (KLI) ద్వారా అందాల్సిన సాగునీరు నిలిచిపోయింది. చర్ల ఇటిక్యాల శివారులోని D-26 కాల్వకు కొందరు అడ్డుగా నిర్మాణాలు చేపట్టడంతో నీటి ప్రవాహం ఆగిపోయిందని రైతులు తెలిపారు. దీంతో తాడూరు, గుంతకోడూరు, అల్లాపూర్, తాళ్లపల్లి, నడిగడ్డ, రఘుపతిపేట తదితర గ్రామాలకు సాగునీరు అందక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...