Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువల మూసివేతతో దుకాణంలోకి నీరు

Follow Udayam on Google
B. Rajesh Sep 29, 2026 10:37 AM విజయనగరంGeneral
కాలువల మూసివేతతో దుకాణంలోకి నీరు - Udayam
కొత్తవలసలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి విజయనగరం రోడ్డులోని ఓ కిరాణా దుకాణం నీట మునిగింది. వీరసాగరం కాలువలను శాశ్వతంగా మూసివేయడంతో వర్షపు నీరు దుకాణంలోకి వస్తోందని నిర్వాహకులు వాపోయారు. దుకాణంలోని సరుకులు తడిసి పాడవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...