వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న పి.కాలేబు(22) అదృశ్యమయ్యాడు. పాయకరావుపేట మండలం కొర్లయ్యపేటకు చెందిన కాలేబు శాంతినగర్ బీసీ సంక్షేమ వసతిగృహంలో ఉంటున్నాడు.
ఈ నెల 20న టిఫిన్ కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు, వసతిగృహ సిబ్బంది గాలించినా ఆచూకీ లభించలేదు. వార్డెన్ ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు చేసినట్లు కాకినాడ రెండో పట్టణ సీఐ తెలిపారు.
Comments
Loading comments...

