వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్స్‌లో తాగునీటి దుర్వినియోగానికి పాల్పడిన వినియోగదారుడికి జలమండలి రూ.20 వేల జరిమానా విధించింది. రోడ్ నంబర్ 23లోని ఓ ఇంట్లో తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్‌కు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
దీంతో సంబంధిత వినియోగదారుడికి రూ.20,000 జరిమానా విధించి వసూలు చేశారు. తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తనిఖీలు కొనసాగిస్తామని జలమండలి అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

