వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పత్తికొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ‘ఐ’ న్యూస్ రిపోర్టర్లు బసవరాజు, నాగచంద్రుడు, సురేష్‌లపై అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రి అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు.
కేసులు ఎత్తివేసి విడుదల చేయాలని, జర్నలిస్టులకు ప్రత్యేక చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

