Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ

Follow Udayam on Google
సందీప్ Jul 08, 2026 3:35 PM నిర్మల్ General
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ - Udayam
నిర్మల్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు తమ పిల్లల చదువుల కోసం ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని జిల్లా కలెక్టర్, డీఈఓ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) దర్శనం భోజన్న ఈ రాయితీ ఉత్తర్వులను విడుదల చేశారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడంతో జిల్లావ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...